రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ జరుగుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్, డబ్బులు విడుదల చేయాలని మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలోని ఎస్కేవియన్ కళాశాల నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర సభ్యులు మున్నా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కష్టాలు తీర్చాలన్నారు.