రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానంలో ఘన స్వాగతం లభించింది. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి బాచ్ పాయ్, జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ పెంచల్ కిషోర్, ఎమ్మెల్యేలు అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.