సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ అదనపు గదులను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎంపీడీవో కార్యాలయ అదనపు గదులను నిర్మించడం వల్ల గదులు కొరత తీరిందన్నారు. అదనపు గదులు లేకపోవడంతో అధికారులు విధులు నిర్వహించడానికి ఇబ్బందిగా ఉండేదన్నారు.