ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నాగలాపురం మండలంలోని సురుటుపల్లి ఆనకట్ట వద్ద అరుణమ్మ ఆదివారం పరవళ్ళు తొక్కుతోంది. తమిళనాడు సరిహద్దులోని సురుటుపల్లి ఆనకట్ట వద్ద ప్రవహించే నీరు పూర్తిగా తమిళనాడుకు వెళ్తాంది. ఆనకట్ట ఆంధ్రరాష్ట్రంలో ఉన్నా దాని పర్యవేక్షణ బాధ్యతలు తమిళనాడు ఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లో జరుగుతోంది. పర్యవేక్షణా లోపంతో గేట్లు శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలిపారు.