బీఎన్. కండ్రిగ మండలంలో 5 మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి తిరుపతి జిల్లా డా. వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సోమవారం లాటరీ తీశారు. ఇందులో షాపు నంబర్ 67ని జ్ఞానేష్, 68ని పరమేష్, 69ను లక్ష్మయ్య, 70ను దశరధ నాయుడు, 71ను నరేంద్రబాబు కైవసం చేసుకున్నారని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.