పుత్తూరు డీఎస్పీ రవికుమార్, సత్యవేడు సీఐ మురళి నాయుడుతో కలిసి సోమవారం సాయంత్రం నాగలాపురం పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 2024 సంవత్సరంలో పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పనితీరు, కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యలతో పాటూ పలు ఫైళ్లను తనిఖీ చేశారు. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఇసుక అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని ఎస్ఐ సునీల్ కు సూచించారు.