పిచ్చాటూరులో భారీ వర్షం

85చూసినవారు
తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇందులో భాగంగా పిచ్చాటూరు మండలం రామగిరిలో మధ్యాహ్నం ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందారు. గ్రామంలోని వీధులు జలమయమయ్యాయి. దీంతో పలువురు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షం రాకతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్