సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా కేవీబీ పురం మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ టి. ఓబయ్య సూచించారు. సోమవారం మండలంలోని వగతురు గ్రామంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కాలక్షేపం కోసమో సులువుగా డబ్బు సంపాదించే ఆలోచనలతో ఇంటర్నెట్ వేదికగా చాలామంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని తెలిపారు.