తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో నాలుగు మద్యం దుకాణాలకు తిరుపతి శిల్పారామంలో సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లాటరీ ద్వారా నిర్ణయించారు. నాగలాపురం 85వ షాపును రమ్య, 86వ షాపును ఆశి ముని సుబ్రహ్మణ్యం, 87వ షాపును ఏ రామచంద్రయ్య, 88వ షాపును బాలాజీ రెడ్డి దక్కించుకున్నట్లు ప్రకటించారు. వీరు 16వ తేదీ నుండి కొత్త మద్యం దుకాణాలను నడపనున్నారు.