సత్యవేడు నియోజకవర్గం నాగలాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం అధికారులు ప్రారంభించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని సర్పంచ్ చిన్నదొరై సుధా అన్నారు. ఈ పథకం అమలు వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు.