సత్యవేడు: లలితా త్రిపురసుందరి దేవిగా అమ్మవారి దర్శనం

62చూసినవారు
సత్యవేడు: లలితా త్రిపురసుందరి దేవిగా అమ్మవారి దర్శనం
సత్యవేడులోని శ్రీకళ్యాణ వీరభద్రస్వామి ఆలయంలో విజయదశమి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సర్వమంగళ దేవి లలితాత్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ అర్చకులు సర్వమంగళదేవిని పసుపుకొమ్ములు, వివిధ పుష్పాలతో అలంకరించి లలితా త్రిపురసుందరి దేవి అలంకరణతో తీర్చిదిద్దారు. దీంతో భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్