తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం మండలంలోని గోవర్ధనపురంలో కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సూర్యనారాయణ హోమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు గోపూజ, గణపతి పూజ, లక్ష్మి దీప పూజ, సుబ్రహ్మణ్యం పూజ, అష్ట దిక్పాలకులు, నవగ్రహ పూజలు నిర్వహించారు. భక్తులచే సంకల్పం చేయించి, మనో వికాసం కల్పించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.