రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటకు విచ్చేసిన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఘన స్వాగతం పలికారు. ఆయనకు గజమాలతో సత్కరించి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని శేష వస్త్రం కప్పి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, అమర్నాథ్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.