శ్రీకాళహస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ ఇంటిలోకి మంగళవారం దొంగలు చొరబడ్డారు. బాధితుల వివరాల మేరకు. దొంగలు ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ. 20 వేల నగదు దొంగిలించారు. ఇంటిలోని వస్తువులను, సామగ్రిని చిందర వందర చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.