తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడంతో దుర్వాసన వెదజల్లుతుంది. ఓ పక్క వర్షాలు పడుతుంటే మున్సిపల్ అధికారులు కనీసం పారిశుద్ధ్యంపై దృష్టి సారించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి రోగాల బారి నుంచి తప్పించాలని ప్రజలు కోరుతున్నారు.