సూళ్లూరుపేట: ఫ్లెమంగో ఫెస్టివల్ ను క్లిక్ మనిపించిన కలెక్టర్

60చూసినవారు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శనివారం నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ దొరవారిసత్రం నేలపట్టు పక్షుల కేంద్రాన్ని నేడు సందర్శించారు. అక్కడి పక్షులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సెల్ ఫోన్ లో పక్షుల చిత్రాలను బంధించారు. పర్యాటకులను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. తొలి రోజు పెద్ద సంఖ్యలో పర్యాటకులు నేలపట్టును సందర్శించారు.

సంబంధిత పోస్ట్