ఇంటికి సమీపంలో నిలబడి ఉన్నారని కోపంతో కురబలకోటలో బుధవారం రాత్రి ఇద్దరు యువకులపై తండ్రి కుమారులు కొడవళ్ళతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. చింతమాకులు పల్లెకు చెందిన శ్రీనివాసులు (32), బసిని కొండకు చెందిన గుణశేఖర్ (22) మరికొందరు రాజు ఇంటికి సమీపంలో నిలబడి ఉన్నారు. వారిపై కోపంతో రాజు, అతని కుమారుడు కొడవళ్లతో దాడి చేసి గాయపరిచారని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.