ములకలచెరువు మండలంలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు శనివారం ఎస్సై నరసింహుడు తెలిపారు. మామడుగూరు బాలసుబ్రమణ్యం (40) కాలువ పల్లి - గాలివీడు సరిహద్దులో కోళ్ల ఫారంలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. కోళ్ల ఫారం లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.