తిరుమల శ్రీవారిని ఏపీ దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలియజేశారు. 4వ తేది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ఆగమ శాస్త్రం అనుగుణంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.