తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల కళ

60చూసినవారు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల కళ ఉట్టిపడుతోంది. బుధవారం సాయంత్రం ఆలయ నాలుగు మాడవీధులతో పాటు కొండపై పలు ప్రాంతాల్లో టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాట్లు చేపట్టారు. జీఎంసీ టోలేట్ వద్ద మహావిష్ణువు, సీతారాములు, ఆంజనేయస్వామి భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్చులు అమర్చారు. రాంభగీచ వద్ద ఏడు ద్వారాలతో శ్రీవారిని దర్శించుకున్నట్లు సెట్టింగ్ వేశారు.

సంబంధిత పోస్ట్