ఐఓసీఎల్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి తిరుమలలోని కాకులమాను తిప్ప వద్ద బుధవారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి భూమిపూజ చేశారు. 2. 22 ఎకరాల్లో బయో గ్యాస్ ప్లాంటును ఐఓసీఎల్ నిర్మించనుంది. 0. 17 ఎకరాల్లో కంపోస్టు నిల్వ కేంద్రాన్ని నిర్మించనున్నారు. రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయో గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు.