చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి శనివారం సాయంత్రం తిరుచ్చి వాహనంపై విహరించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి వారు శ్రీనివాసమంగాపురం తిరుమాఢ వీధుల్లో విహరించగా భక్తులు పెద్ద సంఖ్యలో కర్పూర నీరాజనాలు సమర్పించారు.