తిరుమలలో రాంబగీచా బస్టాండ్ వద్ద ఐదు అడుగుల నాగుపాము హల్ చల్ చేసింది. మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ వద్దకు నాగుపాము రావడంతో భక్తులు పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాములు పట్టే భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఐదు అడుగుల పొడవైన నాగుపాము బుసలు కొడుతూ ఉండటంతో చాకచక్యంగా పట్టి అడవిలోకి వదిలేశారు.