శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లాలో అక్టోబర్ 24 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గురువారం ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించొద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లనున్న వేళ ఈ ఆంక్షలు అమల్లోకి తేవడంతో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.