తిరుపతి జిల్లాకు రానున్న కృతిశెట్టి, సంయుక్త

83చూసినవారు
తిరుపతి జిల్లాకు రానున్న కృతిశెట్టి, సంయుక్త
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సూళ్లూరుపేటకు ప్రముఖ హీరోయిన్లు రానున్నారు. వారిలో ఉప్పెన ఫేం కృతిశెట్టి, విరూపాక్ష ఫేం సంయుక్త సింగర్ మంగ్లీతోపాటూ పలువురు ఢీ తారాగణం ఉన్నారు. వారితోపాటూ యాంకర్ రవి, కావ్య సందడి చేయనున్నారు. మరోవైపు మంత్రులు ఆనం, అనగాని సత్య ప్రసాద్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్