తిరుచానూరులో వైభవంగా లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర‌

61చూసినవారు
తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర సోమవారం తిరుచానూరులో వైభ‌వంగా జ‌రిగింది. ముందుగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుండి అద‌న‌పు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం ప‌సుపుమండ‌పం వద్దకు తీసుకొచ్చారు. అక్క‌డ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా తిరుచానూరు మాడ వీధుల గుండా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్