తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కిరణ్మయి, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శరదా తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.