తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం నైవేద్య విరామ సమయంలో ముఖేష్ కుమార్ మీనా, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ రఘురాజు, అంబికా కృష్ణ, తెలంగాణ ఇంటలిజెన్స్ అదనపు డీజీ శివధర్ రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించారు.