చంద్రగిరి కోటకు పూర్వ అనుభవం తీసుకొస్తామని, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఈ కోటలో వసతులు కల్పించి పర్యటకులు వచ్చేలా చేస్తామని ఆయన అన్నారు. శుక్రవారం సౌండ్ అండ్ లైటింగ్ షో ని వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.