తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్ర రథయాత్ర చేపట్టినట్టు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని కంచి మఠంలో శ్రీరామయంత్రానికి(శ్రీచక్రం)స్వామిజీ పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యకు తీసుకువెళుతున్న శ్రీరామ యంత్ర రథాన్ని టీటీడీ జేఈవో వీరబ్రహ్మంతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పురాతనమైన కంచిమఠంలో శ్రీరాముడి మూలయంత్రం ఉందని విజయేంద్ర తెలిపారు.