కివి, పైనాపిల్, ముత్యాలు, తులసి, తామర పూలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆదివారం అర్చకులు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి పాలు, పెరుగు, పసుపుతో స్నపనం నిర్వహించారు. వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు.