సంక్రాంతికి వస్తున్నాం టీం సభ్యులు ఆదివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతిలో సందడి చేశారు. జయశ్యామ్ థియేటర్లో సినిమాను అభిమానులతో కలిసి చూశారు. ఈ సినిమాలోని సెటైర్లు, డైలాగులను హీరోయిన్లు చెప్పగా అభిమానులు కేరింతలు కొట్టారు. హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ మాట్లాడుతూ తాను తిరుపతిలో చదువుకున్నానని చెప్పారు.