ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.