తిరుమలలో నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భవనాన్ని ఈవో జే. శ్రామలరావు శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనంలో భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి చేరుకుని డోనార్ సెల్ ను పరిశీలించారు. నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.