తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా బుధవారం గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం వేణుగానం, తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం జరిపారు. అనంతరంశ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆతరువాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.