తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని లీలా మహల్ కూడలి, కరకంబాడి మార్గం, కొర్లగుంట కూడలి, బ్లిస్ కూడలి, తదితర ప్రాంతాల్లో అసంపూర్తిగా, వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న మురుగునీటి కాలువలను నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ అధికారులతో కలసి శనివారం పరిశీలించారు.