తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయాల్లో గురువారం దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి బాలాలయంలోని స్వామివారికి సమర్పించారు. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించారు.