జనవరి 10వ తేది వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున తిరుప్పావై సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, అర్చన, శ్రావణ తిరుమంజనం, శుద్ధి నిర్వహించారు. అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.