ఏపీలో గత ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నించి ఎన్డీయే కూటమితో విజయం సాధించి. దేశానికి ఒక దిక్సూచిలా జనసేనాని పవన్ కళ్యాణ్ మహాశక్తిగా ఎదిగారని జనసేన నాయకుడు రాజారెడ్డి అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రేషన్ స్మగ్లింగ్ ను అడ్డుకోవడం, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు నిలబడ్డ తమ నాయకుడిని హతమార్చాలని దుష్టశక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు.