ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు డీఎస్పీగా వి. శ్రీనివాసులు రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. బాధ్యతలు చేపట్టిన ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.