తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రముఖ శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీరంగనాథ స్వామికి టీటీడీ ఈవో జె. శ్యామలరావు బుధవారం పట్టువస్త్రాలను సమర్పించారు. దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలకు పట్టువస్త్రాలను 2008ఏడాది నుంచి టీటీడీ సమర్పిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకు ముందు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు శ్రీరంగం ఆలయ కమిషనర్ మరియప్పన్ స్వాగతం పలికారు.