తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట హిందూ సంఘాలు, మఠాధిపతులు మంగళవారం నిరసన దీక్షకు దిగారు. శ్రీవారి లడ్డు కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్వామీజీలు టీటీడీ ఈఓ శ్యామలరావుని కలిసి వినతిపత్రం అందజేసారు. ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో అధర్మం రాజ్యమేలిందని, శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.