వైఎస్ షర్మిల రాజకీయంగా ఒంటరి అయ్యారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదని అన్నారు. వైఎస్ జగన్ లాంటి నాయకులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని, ఇచ్చిన మాట కోసం సర్వం వదులుకుంటారని ఆయన చెప్పారు.