తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలోని బంగారుపేటలో కనుమ వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ప్రత్యేక డప్పులు, పిల్లల ఆటపాటల నడుమ ఊరేగించారు. సాయంత్రం బుజ్జమ్మకలుజు వద్ద గొబ్బెమ్మను నిమజ్జనం చేశారు.