వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలంలో 18 సంవత్సరాలు నిండిన ఓటు హక్కుకు అర్హులు అయిన వారు అందరూ సమీప పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ పూజారి శ్రీనివాసులు సూచించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 23, 24 తేదీల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బిఎల్వోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు కోసం ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశామని తెలిపారు.