టాలీవుడ్ హీరోయిన్ 'కలర్స్' స్వాతి తన భర్త వికాస్ వాసుతో విడాకులు తీసుకోనున్నారని తెలిసింది. సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు హింట్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా స్వాతి తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను SM నుంచి తొలగించారు. దీంతో విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇలాంటి రూమర్సే రాగా.. ఆమె స్పందించిన వీడియో వైరల్ అవుతోంది.