దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్‌గా ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో రాణిస్తున్నాయి. ఇండెక్స్‌లో ప్రధాన కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో ఇవి లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 231 పాయింట్ల లాభంతో 76,655 వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 23,245 వద్ద ఉన్నాయి.