AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ కస్టమర్ తినడానికి దోశ తీసుకున్నారు. అందులో ఈగలు, బొద్దింకలు కనిపించడంతో ఆ కస్టమర్ ఒక్కసారిగా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. కాగా, గతంలో ఇదే పట్టణంలో డయేరియా వ్యాప్తి చెంది నలుగురు చనిపోగా.. 42 మంది అనారోగ్యం బారిన పడ్డారు.