ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 41 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో తొలుత 57 మంది బీఆర్‌ఓ సిబ్బంది చిక్కుకుపోయారు. వారిలో 16 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మిగిలిన వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మంచు దట్టంగా కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ‘త్వరలోనే కార్మికులందరినీ కాపాడుతాం’ అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.