ఇల్లు కట్టడం అనేది ఎవరు పడితే వారు చేసే పని కాదు. ఇంటి ప్లాన్ గీసే ఇంజినీర్‌కే కాదు, ఇంటి పని చేసే మేస్త్రి, అతడితో పాటు పని చేసేవారికి కూడా ఎంతో కొంత నైపుణ్యం ఉండాలి. కానీ, ప్రస్తుతం మనం చూస్తున్న వీడియోలో కొందరు కార్మికులు ఓ గదిని చాలా విచిత్రంగా కట్టారు. తలుపు అమర్చుకోవాలనే ఆలోచన కూడా లేకుండా గది నాలుగు వైపులా గోడ కట్టేశారు. ఓ వ్యక్తి వెళ్లి అడిగిన తర్వాతనే వారికి ఆ విషయం అర్థమైంది.